Telugu Gateway
Telangana

ఎన్టీఆర్ కుమార్తె ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం

ఎన్టీఆర్ కుమార్తె ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం
X

దివంగ‌త ఎన్టీఆర్ నాల్గ‌వ కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హ‌రం ఒక్కసారిగా క‌ల‌క‌లం రేపింది. తొలుత ఆమె అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు గుర్తించారు. గ‌త కొంత కాలంగా ఉమామ‌హేశ్వ‌రి మాన‌సిక ఒత్తిడి, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు చెబుతున్నారు. ఉమామ‌హేశ్వ‌రి వ‌య‌స్సు 52 సంవ‌త్స‌రాలే. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉమా మహేశ్వరి మృతితో ఎన్టీఆర్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోగా ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఉమా మహేశ్వరి ఇటీవలే ఆమె కూతురి వివాహం ఘనంగా నిర్వ‌హించారు. ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య స‌మ‌యంలో ఇంట్లో ఆమె కుమార్తె తోపాటు ఇత‌ర స‌భ్యులు కూడా ఉన్నారు. కానీ ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యంలో గ‌దిలోకి వెళ్లిన ఆమె భోజ‌న స‌మ‌యానికి కూడా బ‌య‌ట‌కు రాక‌పోవ‌టంతో కుటుంబ స‌భ్యులు త‌లుపుత‌ట్టినా ఎలాంటి ఫ‌లితం లేక‌పోయింది. త‌ర్వాత ఫ్యాన్ కు ఉరివేసుకున్న‌ట్లు గుర్తించారు. దీంతో ఆమె కుమార్తె దీక్షిత పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం పోలీసులు అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోనే త‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు కుమార్తె దీక్షిత వెల్ల‌డించారు.

Next Story
Share it