Telugu Gateway
Telangana

ఏపీకి తెలంగాణ ఆర్టీసీ బస్సులు బంద్

ఏపీకి తెలంగాణ ఆర్టీసీ బస్సులు బంద్
X

ఆంధ్రప్రదేశ్-తెలంగాణల మధ్య మరోసారి ప్రజా రవాణా నిలిచిపోయింది ఏపీ సర్కారు ప్రతి రోజూ 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తుండటంతో ఆ రాష్ట్రానికి వెళ్ళే ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఉదయం నుండి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ,ఏపీ మధ్యలో పూర్తిగా మెడికల్ ఏమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి. తెలంగాణ నుండి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే మిగితా వాహనాలు కూడా నిలిపివేశారు. ఏపీ ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండబోతున్నాయి.

Next Story
Share it