Telugu Gateway
Telangana

లాయర్ బయట..కేటీఆర్ లోపల

లాయర్ బయట..కేటీఆర్ లోపల
X

ఫార్ములా ఈ రేస్ కేసు లో మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనతో లాయర్ ను అనుమతిస్తేనే విచారణకు హాజరు అవుతాను అంటూ ఆయన సోమవారం నాడు ఏసీబీ ఆఫీస్ ముందు హంగామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు మరో సారి నోటీసు లు జారీ చేసి జనవరి 9 న ఒక్కరే విచారణకు హాజరు కావాలని తేల్చిచెప్పారు. అయితే దీనిపై కేటీఆర్ మరో సారి హై కోర్ట్ ఆశ్రయించి విచారణలో తనతో పాటు లాయర్ ను కూడా అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్ మోషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హై కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో కేటీఆర్ పక్కన లాయర్ కూర్చోవటానికి అనుమతి ఇవ్వటం సాధ్యం కాదు అని తేల్చిచెప్పింది.

అయితే వేరే గదిలో కూర్చుకుని విచారణను కేటీఆర్ తరపు లాయర్ చూడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేటీఆర్ కోరుకున్న రిలీఫ్ దొరకలేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రధాన అభ్యంతరం అంతా తాను ఒకటి చెపితే అధికారులు మరొకటి మీడియాకు లీకు ఇచ్చే అవకాశం ఉంది అని ...మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి విషయంలో అలాగే చేశారు అని ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే విచారణలో తనతో పాటు లాయర్ ఉంటారు అంటూ ఆయన చెపుతూ వచ్చారు. అయితే తెలంగాణ హై కోర్ట్ మాత్రం కేటీఆర్ కోరుకున్నట్లు ఆయనతో పాటు లాయర్ ఉండటానికి నో చెప్పింది.

Next Story
Share it