Telugu Gateway
Telangana

ప‌ట్ట‌ణీక‌ర‌ణ ఎవ‌రు ఆపినా ఆగ‌దు

ప‌ట్ట‌ణీక‌ర‌ణ ఎవ‌రు ఆపినా ఆగ‌దు
X

మున్సిప‌ల్ శాఖ‌లో ఎంత ప‌నిచేసినా ప్ర‌శంస‌లు రావు

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ మున్సిప‌ల్ శాఖ‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ శాఖ‌లో సంవత్సరం పొడుగునా ప్రతి రోజూ పని చేసినా, ప్రజల నుంచి ప్రత్యేకంగా ప్రశంసలు రావన్నారు. ఏదో ఒక కారణం వల్ల పురపాలక శాఖ లో పని ఆగిపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతాయని అన్నారు. ప్రభుత్వంలో, ప్రజల కోసం నిరంతరం, అత్యధికంగా కష్టపడుతున్న విభాగాల్లో పురపాలక శాఖ ఒకటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలోని నగరపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లతో పట్టణ ప్రగతి పైన జరిగిన సమావేశంలో మాట్లాడిన కెటీఆర్ ప‌లు అంశాల‌పై స్పందించారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ రాష్ట్రం గా చెప్పవచ్చు. ఇప్పటికే సుమారు 46 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఐదునుంచి ఆరు సంవత్సరాలో సగానికి పైగా జనాభా తెలంగాణలో పట్టణాల్లో నివసించపోతున్నదని తెలిపారు. గత ఐదు వేల సంవత్సరాలుగా జరిగిన పట్టణీకరణ కన్నా ఎక్కువగా రానున్న 50 సంవత్సరాల్లో జ‌రిగే అవ‌కాశం ఉంది. ఉత్త‌మ అవకాశాలు, వసతుల కోసం ప్రజలు పట్టణాలకు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతుల కల్పన అత్యంత సవాలుగా మారిందని తెలిపారు. తెలంగాణలో గత ఏడు సంవత్సరాల్లో రెట్టింపు అయిన జీఎస్ డీపీలో సింహభాగం పట్టణాల నుంచి వస్తున్నదని తెలిపారు.

మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను స్థానిక పురపాలికల పైన భారం వేయకుండా తాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపడుతుందని తెలిపారు. ప‌ట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాలు ఆపాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా మౌలికవసతులపై పడే ఒత్తిడిని ఆధిగమించడమే అందరి ముందు ఉన్న పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. పట్టణాలను మరింత మెరుగ్గా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యతపై మనపై ఉందన్నారు. పురపాలకశాఖ అధికారులు, సిబ్బంది మిగతా శాఖల కంటే ఎక్కువ గొడ్డు చాకిరీ చేస్తున్నారు, కొత్త మున్సిపాలిటీలకు ఇప్పటి వరకు అదనపు సిబ్బంది ఇవ్వకున్నా ఉన్న పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని తెలిపారు. 2023 మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్ తప్పనిసరి అని స్ప‌ష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి మున్సిపాలిటీలో డిజిటల్ డోర్ నంబర్ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. తెలంగాణ‌లో ప‌ల్లెలు బాగున్నాయని ముఖ్యమంత్రి పదేపదే అంటుంటారు, పట్టణాలు కూడా బాగున్నాయని అనిపించుకోవాలని వ్యాఖ్యానించారు.

Next Story
Share it