Telugu Gateway
Telangana

తెలంగాణలో లాక్ డౌన్ ప్రతిపాదన చేయలేదు

తెలంగాణలో లాక్ డౌన్ ప్రతిపాదన చేయలేదు
X

తెలంగాణలో లాక్ డౌన్ ఉంటుందా? ఉండదా అనే అంశంపై గత కొన్ని రోజులుగా రకరకాల చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ కరోనా నుంచి కోలుకుని వచ్చిన తర్వాత జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని ప్రచారం జోరందుకుంది. అయితే లాక్ డౌన్ ప్రతిపాదనల వార్తలను తెలంగాణ హెల్త్ డైరక్టర్ జి. శ్రీనివాసరావు ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల‌ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్లు ప‌లు ఎల‌క్ట్రానిక్ మీడియా, సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు.

వైద్య ఆరోగ్య శాఖ అటువంటి ప్ర‌తిపాద‌న‌లేవీ ఇవ్వ‌లేదు. ప్రస్తుతం తెలంగాణ‌లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌లో స్థిర‌త్వం వ‌చ్చింది. ప్ర‌జ‌లు ఇలాగే జాగ్ర‌త్త‌లు పాటిస్తే మ‌రో 3-4 వారాల్లో వైర‌స్ అదుపులోకి వ‌స్తుంది. కాబ‌ట్టి లాక్‌డౌన్ పెట్టాల‌నే ఆలోచ‌న కానీ, ప్ర‌తిపాద‌న‌లు కానీ ఏమీ ఇవ్వ‌లేదు. క‌నీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్య ఆరోగ్యశాఖ‌కు లేదు.' అని తెలిపారు. వాస్తవానికి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా గతంలో పలుమార్లు లాక్ డౌన్ ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Next Story
Share it