Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ కొత్త నినాదం ఐటి దాడుల రహిత దేశమా!

బిఆర్ఎస్ కొత్త నినాదం ఐటి దాడుల రహిత దేశమా!
X

కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ బీజేపీ ముక్త్ భారత్ అని ప్రకటించారు. దేశం నుంచి బీజేపీ నే లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇప్పుడు అయన కేబినెట్ సహచరుడు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. కెసిఆర్ నాయకత్వం లో 2024 లో కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ దేశంలో అధికారంలోకి రావటం ఖాయం అని చెప్పారు. అంతే కాదు అప్పుడు దేశంలో ఐటి దాడులు ఉండవని అని సంచలన ప్రకటన చేశారు. ఎవరు అయినా..ఎంతైనా సంపాదించు కోవచ్చు అని...కానీ స్వచ్ఛందంగా వాళ్ళు పన్ను చెల్లించేలా నిబంధనలు తీసుకొస్తామని ప్రకటించారు.

తాజా గా పెద్ద ఎత్తున ఐటి దాడులను ఎదుర్కొన్న అయన దేశ ఐటి పాలసీ ఎలా ఉండబోతోందో చెప్పటం అన్నది ఈ మొత్తం వ్యవహారం హైలైట్ అని చెప్పుకోవచ్చు. టీడీస్ ఉండే ఉద్యోగులు తప్ప చాలా మంది ఎలా పన్ను ఎగవేయవచ్చు అనే అంశంపైనే ఫోకస్ పెడతారు అనే విషయం తెలిసిందే. కానీ మంత్రి మల్లా రెడ్డి మాత్రం స్వచ్ఛందంగా పన్ను కట్టే విధానం తీసుకొస్తామని ప్రకటించారు. పైగా తనపై బీజేపీ కక్ష పూరితంగా ఐ టి దాడులు చేయించింది అని ప్రకటించారు. అయినా కెసిఆర్ ఉన్నంత కాలం తాను ఎవరికీ భయపడాల్సిన పని లేదని తెలిపారు. తాజాగా జరిగిన ఐ టి దాడులకు సంభందించి ఆ శాఖ అధికారులు మంత్రి మల్లా రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. వేరు సోమవారం నాడు విచారణకు హాజరు కానున్నారు.

Next Story
Share it