Telugu Gateway
Telangana

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్య‌ర్దే లేడు

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్య‌ర్దే లేడు
X

హుజూరాబాద్ లో అదికార టీఆర్ఎస్ పార్టీకి స‌రైన అభ్య‌ర్ధే లేక చివ‌ర‌కు కాంగ్రెస్ అభ్య‌ర్ధికి గాలం వేశార‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డ‌బ్బులు ఇచ్చి తాను టీపీసీసీ ప‌ద‌వి కొనుక్కున్న‌ట్లు కౌశిక్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు ఆయ‌న సొంతం కాద‌ని..సీఎం కెసీఆర్ మాట్లాడించిన మాట‌లు అన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్నార‌నే విష‌యం త‌న‌కు ముందే తెలుస‌న్నారు. అయితే ఆయ‌న‌కు ఆ పార్టీ టిక్కెట్ ఇస్తుందని అనుకోవ‌టంలేద‌ని తెలిపారు. త‌మ అభ్య‌ర్ధి ఎవ‌రో ఇప్పుడే చెప్పం అని..బ‌ల‌మైన నాయ‌కుడే ఉంటార‌న్నారు.

రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని తెలిపారు. అన్ని సామజిక వర్గాలకు కాంగ్రెస్ లో సమన్యాయం ఉంటుందని వెల్ల‌డించారు. ఎల్ రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. కేసీఆర్ టీ.ఆర్.ఎస్ లోకి తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్ లోకి వస్తున్నారని, ముగ్గురు కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఈ రోజు మా పార్టీలోకి వచ్చారని రేవంత్ అన్నారు.

Next Story
Share it