Telugu Gateway
Telangana

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వీవీసీ మోటార్స్ మ‌హీంద్రా షోరూమ్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వీవీసీ మోటార్స్ మ‌హీంద్రా షోరూమ్
X

వివిసీ మోటార్స్ హైద‌రాబాద్ లోని ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ లో కొత్త‌గా మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా(ఎంఅండ్ఎం) షోరూమ్ ను ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో వీవీసీ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ వి. రాజేంద్ర‌ప్ర‌సాద్ తో పాటు మ‌హీంద్రా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. న‌గ‌రంలో ఇప్ప‌టికే ప‌లు చోట్ల ఎంఅండ్ ఎం షోరూమ్ లు నిర్వ‌హిస్తున్న వీవీసీ మోటార్స్ వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు కొత్త‌గా ఫైనాన్సియ‌ల్ డిస్ట్రిక్ట్ లోనూ కొత్త షోరూమ్ ప్రారంభించింది.

మ‌హీంద్రా వాహ‌నాల‌కు మార్కెట్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే. కొత్త‌గా విడుద‌ల చేసిన ఎస్ యూవీ ఎక్స్ యూవీ700కు మంచి డిమాండ్ ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మ‌హీంద్రా థార్ వాహ‌నం సూప‌ర్ స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే వీవీసీ ట్ర‌స్ట్ త‌ర‌పున ఛైర్మ‌న్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఖ‌మ్మం పోలీసు క‌మిష‌న‌రేట్ కార్యాల‌యంలో పోలీస్ శాఖ‌కు మినీ ట్రాక్ట‌ర్ ను విత‌ర‌ణ‌గా అంద‌జేశారు.

Next Story
Share it