Telugu Gateway
Telangana

కెసిఆర్ కు ఫాక్స్ కాన్ చైర్మన్ లేఖ

కెసిఆర్ కు ఫాక్స్ కాన్ చైర్మన్ లేఖ
X

తెలంగాణ లో పెట్టుబడులకు సంబంధించి ఫాక్స్ కాన్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ తో సమావేశం అయ్యారు ఆ తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ లో ఫాక్స్ కాన్ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంది అని...దీని ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని ప్రకటన జారీచేసింది. అసలు పెట్టుబడి ఎంతో చెప్పకుండా...ఏకంగా లక్ష ఉద్యోగాలు అంటే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణ తరహాలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా ఫాక్స్ కాన్ విషయంలో అలాంటి ప్రకటనే చేసింది. ఈ ప్రకటనలపై తర్వాత కంపెనీ వివరణ ఇచ్చింది. పెట్టుబడులు...ఉద్యోగాలకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు చెప్పిన మాటలు తమవి కావు అని...తాము రాష్ట్రాలతో కట్టుబడి ఉండాల్సిన ఒప్పందాలు ఏమి చేసుకోలేదని స్పష్టం చేసింది.

అదే సమయంలో స్థానిక ప్రభుత్వాలతో చర్చలు సాగించినట్లు తెలిపింది. ఈ ప్రకటన ఇటు తెలంగాణ తో పాటు అటు కర్ణాటక లోనే రాజకీయ దుమారం రేపింది. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లు రాసిన లేఖను సర్కారు విడుదల చేసింది. మార్చ్ 2 న జరిగిన సమావేశంలో చర్చించినట్లు ఫాక్స్ కాన్ కొంగర కలాన్ లో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని, సాధ్యమైనంత వేగంగా కొంగర కలాన్ పార్క్ నిర్వహణలోకి వచ్చేలా సీఎం తో పాటు ప్రభుత్వ టీం సహకారం కోరారు ఆ లేఖలో.అదే సమయంలో సీఎం కెసిఆర్ ను తన వ్యక్తిగత అతిధిగా తైవాన్ ఆహ్వానిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు.

Next Story
Share it