Telugu Gateway
Telangana

క‌రోనా త‌గ్గింది..డెంగ్యూ..మ‌లేరియా పెరుగుతోంది

క‌రోనా త‌గ్గింది..డెంగ్యూ..మ‌లేరియా పెరుగుతోంది
X

తెలంగాణ‌లో క‌రోనా రెండ‌వ ద‌శ ముగిసిన‌ట్లేన‌ని వైద్య ఆరోగ్య శాఖ డైర‌క్ట‌ర్ శ్రీనివాస‌రావు వెల్ల‌డించారు. అయితే సీజ‌న‌ల్ వ్యాధులు పెరుగుతున్నాయ‌న్నారు. ముఖ్యంగా ప‌లు చోట్ల డెంగ్యూ, మ‌లేరియా కేసులు పెరుగుతున్న‌ట్లు గుర్తించామ‌న్నారు. ఆయ‌న బుధ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌ను వివ‌రించారు. అందులోని ముఖ్యాంశాలు..' సెకండ్ వేవ్ ను పూర్తిగా కంట్రోల్ చేసుకున్నాం. ప్రభుత్వానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. వ‌ర్షాల సీజన్- ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. కొత్తగూడెంలో 220, ములుగు లో 100కు పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.12వందలకు పైగా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి.

జిహెచ్ ఎంసి పరిధిలో కూడా డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ- మలేరియా వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దు. ట్రైబెల్ ఏరియాల్లో మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉంది. గతంతో పోల్చితే ఈ ఏడాది కేసుల సంఖ్య తక్కువగా ఉంది. 2025 లోపు తెలంగాణ రాష్ట్రాన్ని మలేరియా రహిత రాష్ట్రంగా అవ్వబోతోంది. థర్డ్ వేవ్ గురించి దేశంలో ఏ రాష్ట్రం ప్రిపేర్డ్ గా లేదు- తెలంగాణ సిద్ధంగా ఉంది. డెల్టా వేరియంట్ ను దేశం దాటేసింది. తెలంగాణ రాష్ట్రం లో 1కోటి 65లక్షలకు వ్యాక్సిన్ వేశాం. 56శాతం వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. రాబోయే రోజుల్లో ఇంటింటికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యా సంస్థలు తెరిచేందుకు మేము నివేదిక ఇచ్చాం. టీచర్లకు ఇప్పటికే వ్యాక్సిన్ ఇచ్చాం' అని తెలిపారు.

Next Story
Share it