Telugu Gateway
Telangana

ట్యాంక్ బండ్ కు కొత్త అందాలు

ట్యాంక్ బండ్ కు కొత్త అందాలు
X

హైదరాబాద్ లో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ ఒకటి. నగర పర్యటనకు వచ్చేవారంతా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని చూడకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ట్యాంక్ బండ్ ఇప్పుడు కొత్త అందాలు సంతరించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి కెటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆధునీకరించిన ట్యాంక్ బండ్ ఎలా ఉంది?. సలహాలు..సూచనలు చేయండి అంటూ కామెంట్ పెట్టారు.

దీంతో చాలా మంది అక్కడ ట్రాఫిక్ సమస్యను లేవనెత్తటంతోపాటు ఐదు నిమిషాల పాటు ఆ ప్రాంతంలో నిలుచోలేమని..అక్కడ వచ్చే వాసన భరించలేమంటూ కామెంట్ చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో నీళ్ళు వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే హుస్సేన్ సాగర్ లో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించటానికి కొత్త బోట్లు కూడా రానున్నాయి.

Next Story
Share it