Telugu Gateway
Telangana

బీ సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం

బీ సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం
X

తెలంగాణ స‌ర్కారు బీ సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం క్రిష్ణ‌మోహ‌న్ ను నియ‌మించింది. ఛైర్మ‌న్ తోపాటు ముగ్గురు స‌భ్యుల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. క‌మిష‌న్ లో సీహెచ్. ఉపేంద్ర‌, శుభ‌ప్ర‌ద ప‌టేల్ నూలి, కె. కిషోర్ గౌడ్ ల‌కు చోటు క‌ల్పించారు. క‌మిష‌న్ విదివిధానాల‌ను మ‌రో జీవోలో వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు ప‌ద‌వులు వ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు క్రిష్ణ‌మోహ‌న్ కు బీ సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది. గ‌త కొంత కాలం వ‌కుళాభ‌ర‌ణం మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it