కెసీఆరే నా బలం..నా బలగం ఖమ్మం ప్రజలు
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నోటీసుల వ్యవహారంపై టీఆర్ఎస్ లోక్ సభా నేత నామా నాగేశ్వరరావు స్పందించారు. ఆయన శనివారం నాడు హైదరాబాద్ లో మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. తనకు రాజ్యాంగం- ట్రిబ్యునల్ పై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో నామా వ్యాఖ్యలు. నా గురించి ప్రజలందరికీ తెలుసు నేను నీతి నిజాయితీ తో ఉంటాను. ప్రజలకు సేవ చేసేందుకు రాజ్యాంగ వ్యవస్థ అనే బాటలో ముందుకు వెళ్తున్నా. మా నాయకుడు కేసీఆర్ బాటలో నేను నడుస్తా- నా బలం కేసీఆర్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కేసీఆర్ వెంటనే నడుస్తా ఉంటా!. కంపెనీల్లో నేను డైరెక్టర్ గా లేను- మా తమ్ముళ్లు చూస్తున్నారు. 2011లో రాంచీ ఎక్స్ప్రెస్ వే 160కిలోమీటర్ల ప్రాజెక్టు తో మొదలైంది. 16వందల కోట్ల ప్రాజెక్టులో 460 కోట్లు కంపెనీ ఇవ్వాలి. మిగతా అమౌంట్ బ్యాంక్ లు ఇవ్వాలి. బ్యాంకు ప్రాజెక్టు మీద 652కోట్లు మాత్రమే పెట్టింది. వడ్డిగా 378 కోట్లు తీసుకుంది. అటవీశాఖ క్లియరెన్స్ లేకపోవడంతో ప్రాజెక్టు రద్దు చేశాం.
టర్మినెట్ చేసే సమయానికి 60శాతానికి పైగా ప్రాజెక్టు వర్క్ అయింది. ఎస్క్రోఅకౌంట్ కు వందశాతం పవర్ బ్యాంక్ కు మాత్రమే ఉంటుంది- కంపెనికి లేదు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం మేము పనిచేసాము. ప్రాజెక్టు పై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. దేశవ్యాప్తంగా బిఓటి ప్రాజెక్టు నిబంధనలు కేంద్రం మార్పులు చేసింది అని తెలిపారు. ఇక కేసు విషయానికి వస్తే కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి నాఈమా కంపెనీ 1,029.39 కోట్ల రూపాయల రుణం పొందింది. ఈ రుణం పక్కదారి పట్టిందనే ఆరోపణలపై ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది.మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.