Telugu Gateway
Telangana

కెసీఆర్ కు మోడీ జన్మ దిన శుభాకాంక్షలు

కెసీఆర్ కు మోడీ జన్మ దిన శుభాకాంక్షలు
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గురువారం నాడు ట్వి్ట్ట‌ర్ వేదిక‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శ‌ర్మ కూడా ట్విట్ట‌ర్ ద్వారా కెసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు అంటూట్వీట్‌ చేశారు. 'మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. కెసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ కూడా కెసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story
Share it