Telugu Gateway
Telangana

స్కాం లో పేరు వచ్చాక...కవిత విక్టరీ సంకేతం దేనికో?!

స్కాం లో పేరు వచ్చాక...కవిత విక్టరీ సంకేతం దేనికో?!
X

కొన్ని కొన్ని ఫోటో లు పెద్ద పెద్ద వార్తలు చేయలేని పని చేస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఒకటి జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా ఢిల్లీ లిక్కర్ స్కాం పెద్ద చర్చనీయాంశగా మారింది. తొలిసారి ఈడీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్సీ కవిత పేరు ఈ స్కాం కు సంబంధించి పేరును ఒక రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. లీగల్ గా ఈ కేసు ఎంత బలంగా నిలుస్తుంది...తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒక అంచనాకు రావటం ఒకింత కష్టంతో కూడుకున్న పనే. కాక పోతే తొలిసారి సీఎం కుమార్తె పేరు ఒక స్కాం లో రావటం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనమే. అయితే ఇదే అంశంపై మీడియా తో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత రాజకీయ విమర్శలతో ఎదురుదాడి చేశారు. ఈడీ ప్రశ్నలు అడిగితే సమాదానాలు చెపుతా..మహా అయితే అరెస్ట్ చేస్తారు...చేసుకోండి అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. కాక ఫొతే కవిత అసలు మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు తీసుకోలేదు...ఫోన్ నంబర్లు..ఫోన్ల ను నాశనం చేసిన విషయం మీద మాత్రం ఏమి మాట్లాడలేదు.

ఇది అంతా ఒక ఎత్తు అయితే ఇదే అంశం మాట్లాడానికిముందు వస్తూ ఎమ్మెల్సీకి కవిత విక్టరీ సంకేతాలు చూపటం ఇప్పుడు అధికార ..రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఎవరైనా స్కాం లో పేరు వస్తే ఇలా విక్టరీ సంకేతం చూపిస్తారా అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ నేతల్లో మాత్రం దీనిపై మరో రకమైన చర్చ సాగుతోంది. ఈడీ కేసు పెట్టినా తాము ఏమి భయపడటం లేదు అని చెప్పుకోవటానికి...కేవలం రాజకీయ కోణంలోనే కేసు పెట్టారని చెప్పే ప్రయత్నమే ఇది అంతా అని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యనిస్తున్నారు. కాక పోతే ఈ ఫోటోలు చూసిన సామాన్య ప్రజలకు మాత్రం ఇది కచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపుతుంది అనే చర్చ నడుస్తోంది. ఎందుకు అంటే స్కాం లో పేరు వచ్చిన సమయంలో వివరణ ఇవ్వటానికి వస్తూ ఇలా చేయటం వెనక ఎలాంటి వ్యూహాలు ఉన్నా ఇది మాత్రం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it