Telugu Gateway
Telangana

కెసిఆర్ ని కలిశాక కవిత వైఖరి మారిందా?!

కెసిఆర్ ని కలిశాక కవిత వైఖరి మారిందా?!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబధించి ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత వైఖరి అకస్మాత్తుగా ఎందుకు మారింది. అది కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన తర్వాత. శనివారం నాడు కవిత ప్రగతి భవన్ లో కెసిఆర్ తో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. తొలుత సిబిఐ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత తన నివాసంలోనే నోటీసులు ఇచ్చిన సిబిఐ అధికారులకు వివరణ ఇస్తా అని స్వయంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసు కు సంబంధించి ఇటీవల ఈ డీ కవిత పేరును అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించటం.ఆ తర్వాత వెంటనే సిబిఐ ఆమెకు సిఆర్ పీ సి సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 6 న విచారణకు అనువైన సమయం చెప్పాలని నోటీసు లో కోరగా...డిసెంబర్ 6 న తన నివాసానికి రావాలని కవిత సూచించారు. కానీ శనివారం సాయంత్రానికి ఒక్కసారిగా సీన్ మారిపోయింది. విచారణకు ముందు తనకు ఢిల్లీ లిక్కర్ స్కాం విషయం లో హోమ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీ ప్రతులు ఇవ్వాలని కోరారు. ఈ డాక్యూమెంట్లు ఇస్తే వేగంగా సమాదానాలు ఇవ్వటానికి అవకాశం ఉంటాదని..అప్పుడు విచారణ తేదీ ఖరారు చేయవచ్చని సిబిఐ అధికారి అలోక్ కుమార్ షాహీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంటే డిసెంబర్ 6 వ తేదీన విచారణ కు సిద్ధంగా లేనట్లే అనే సంకేతాలు పంపారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి దీనిపై సిబిఐ ఎలా స్పందిస్తోందో వేచి చూడాల్సిందే.

Next Story
Share it