ఎమ్మెల్సీ కవిత ఈడీ కే చుక్కలు చూపించారంట?!
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కేంద్ర విచారణ సంస్థ అయిన ఈడీ కే చుక్కలు చూపించారు అట. సోమవారం నాడు పదకొండు గంటల పాటు విచారణ పూర్తి అయిన తర్వాత బిఆర్ఎస్ తరపున వాట్సాప్ గ్రూపుల్లో ఒక ప్రకటన వచ్చింది. ఇది కెసిఆర్ ఫ్యామిలీ పత్రిక నమస్తే తెలంగాణ లో పూర్తిగా అదే లైన్ లో ఉండటంతో ఇది అధికారిక ప్రకటనగానే భావించవచ్చు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎవరిని అరెస్ట్ చేసినా వారి రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించటం, అప్ కు వంద కోట్ల నిధులు ఏర్పాటులో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషింది అని ఈడీ చెపుతోంది. ఈ కారణంగానే కవిత కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈడీ విచారణ సాగగా..మంగళవారం నాడు మరో సారి అంటే మూడవ సారి విచారణ జరగనుంది. ఈడీ విచారణకు సంబంధించి బిఆర్ఎస్ విడుదల చేసిన ప్రకటన అధికారవర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ఆ ప్రకటన పూర్తిగా ఇలా ఉంది.
‘11 గంటలు - 14 ప్రశ్నలు
పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తున్నప్పటికీ సహాయ నిరాకరణగా చిత్రీకరించే కుట్ర
ఇప్పటివరకు ఎవ్వరితో కూడా కన్ఫ్రంట్ చేయని అధికారులు
ఎమ్మెల్సీ కవిత పాత్రకు సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా చూపెట్టలేకపోయిన ఈడి... ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారించిన ఈడి
నేను ఎలాంటి తప్పు చేయలేదు.. ఇది కేవలం రాజకీయ కుట్ర అని కుండబద్ధలు కొట్టిన కవిత
రాజకీయ ఒత్తిడితో ఈడి పారదర్శకత లోపించిందని ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
కేవలం పొలిటికల్ లైన్ లో ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు
నన్ను నిందితురాలుగా పిలిచారా అని ఈడి ఆఫీసర్లను ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.. కాదు అని నీళ్ళు నమిలిన అధికారులు
విచారణకు పిలిచి ఎలాంటి కన్ఫ్రంటేషన్ చేయకుండా పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో విచారణ చేసిన అధికారులు
తాను విచారణకు సంపూర్ణగా సహకరిస్తున్నానని నొక్కి చెప్పిన కవిత
సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన కవిత
గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అధికారులకు స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత
తను ఫోను ధ్వంసం చేసినట్టు మీడియా కి లీకులు ఎవరు చెప్పారని ఈడి అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.. ఖంగుతిన్న అధికారులు
బిజెపిలో చేరగానే మరుగునపడ్డ కేసుల గురించి ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో నీళ్లు నమిలిన అధికారులు..
బీజేపీ లో చేరాక మరుగున పడ్డ హిమంతా బిశ్వ శర్మ సుజనా చౌదరి నారాయణరాణి కేసులను ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత
ఈడి కార్యాలయానికి చేరుకున్న గంట వరకు రాని అధికారులు..
గంటలపాటు రూమ్ లో ఒకరిని కూర్చోబెట్టి మానసికంగా హించించిన కార్యక్రమం చేసిన ఈడి అధికారులు
ఈడి అధికారుల విచారణలో పారదర్శకత లేదు ’ అంటూ సాగింది ఈ ప్రకటన.