ఓవైసీవి అనుచిత వ్యాఖ్యలు
BY Admin25 Nov 2020 11:56 AM

X
Admin25 Nov 2020 11:56 AM
అక్రమ నిర్మాణాలు అంటూ పేదల ఇళ్ళను కూలుస్తున్న తెలంగాణ సర్కారుకు దమ్ముంటే హుస్సేస్ సాగర్ భూమిని ఆక్రమించి కట్టిన పీ వీ నరసింహరావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు. ఇద్దరు నేతలపై అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
పీ వీ నరసింహరావు, ఎన్టీఆర్ లు తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహానీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజా సేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
Next Story