Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్

తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్
X

మెదక్ కలెక్టర్ నివేదిక చెల్లదు

రాచమార్గంలో వెళ్ళండి..బ్యాక్ గేటు ద్వారా కాదు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెందిన జమున హ్యాచరీస్ భూముల విషయంలో సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆగమేఘాల మీద విచారణ జరపటం, దీనిపై కలెక్టర్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదు అని హైకోర్టు స్పష్టం చేసింది. మే 1, 2 తేదీల్లో జరిగిన ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవద్దని ఆదేశించింది. అదికారులు సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించారని హైకోర్టు తప్పుపట్టింది. జమునా హ్యాచరీస్ భూములు,వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని..ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. నోటీసులు ఇచ్చి పద్దతి ప్రకారం విచారణ చేయాలంటూ ప్రతివాదులు అందరికీ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను జులై6కి వాయిదా వేసింది. జమున హ్యాచరీస్ వేసిన పిటీషన్ పై హైకోర్టులు పలు ఆసక్తికర వాదనలు జరిగాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న జమునా యాచరీస్ కు చెందిన కంపెనీ నిర్వహకులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పిటీషనర్ల భూముల పైన రెవెన్యూ, విజిలెన్స్ విచారణ చేపట్టారు.

పత్రికల్లో,ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి భూముల్లోకి వెళ్లారని తెలిసిందన్న పిటీషనర్ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి. కలెక్టర్ 24 గంటల్లో సర్వే చేసి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.66 ఎకరాలు ఆసైన్డ్ భూమి అక్రమాలకు పాల్పడినట్లు కలెక్టర్ ప్రభుత్వానికి తెలిపారని వెల్లడించిన పిటీషనర్. ఏ చట్టం కింద నోటీసులు లేకుండా తమ భూముల్లోకి వెళ్ళొచ్చా సమాధానం చెప్పాలన్న పిటీషనర్ తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి. పట్టా భూముల ను కొనుగోలు చేసి జమునా యాచరిస్ కంపెనీ పెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ధరణి పోర్టల్ లో కూడా అవి పట్ట భూములని ఉందన్న ప్రకాష్ రెడ్డి తెలిపారు. సాధారణంగా ఏదైనా విచారణ జరిగితే కొన్ని రోజుల పాటు జరుగుతుంది..కానీ ఇక్కడ అత్యoత వేగంగా విచారణ పూర్తి చేసినట్టు నివేదిక ఇచ్చారన్నారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు కాఫీని కోర్ట్ దృష్టి కి తెచ్చిన పిటిషనర్ తరపు న్యాయవాది. రైతుల ఫిర్యాదు ను స్వీకరించి సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం ను ఆదేశించాలని కోరిన ప్రకాష్ రెడ్డి. ఇలాంటి విచారణ సమయంలో ఖచ్చితంగా ఓనర్ లకు నోటీసులు ఇవ్వాలి...కానీ ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కొన్ని గంటల్లోనే రిపోర్ట్ తయారు చేసి సాయంత్రానికి నివేదిక సిద్ధం చేస్తామని అధికారులు మీడియా లో మాట్లాడారు.

ఫిర్యాదు వచ్చిన మరుసటి రోజే ఉదయం 6 గంటల నుండి విచారణ ప్రారంభం చేశారు. నివేదిక తయారు చేసిన దాంట్లో కలెక్టర్ ఈటెల జమునా w/o నితిన్ అని రాసిన దాన్ని కోర్ట్ దృష్టికి తెచ్చిన పిటిషనర్ న్యాయవాది. నివేదిక త్వరిత గతిన పూర్తి చేయాలని కనీసం జాగ్రతలు తీసుకోకుండా ఇష్టానుసారంగా బంధాలు మార్చేశారన్న ప్రకాష్ రెడ్డి. నివేదిక లో 66 ఏకరాలు అసైన్డ్ భూములు అని చెప్పారు. 58.37 ఎకరాల్లో పొజిషన్ లో ఉన్నటు పేర్కొన్న పిటిషనర్ న్యాయవాది. సర్వే 130 లో 18 ఎకరాల్లో 3 ఎకరాల్లో పట్ట భూమి ఉందన్న ప్రకాష్ రెడ్డి. సర్వే 81 లో 9 ఎకరాల్లో అందులో 5 ఎకరాల్లో పొజిషన్ లో ఉన్నామన్నారు. కలెక్టర్ హోదా లో ఉండి సక్రమంగా విచారణ జరుపకుండ అత్యంత వేగంగా నివేదిక ఇవ్వడం ఏమిటన్న - పిటిషనర్ న్యాయవాది. వాదనలు అన్నీ విన్న హైకోర్టు సరైన పద్దతిలో నోటీసులు సర్వ్ చేసి విచారణ జరపాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని..శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదన్నారు. రాచ మార్గం లో వెళ్ళండి బ్యాక్ గేట్ నుంచి కాదు అని సర్కారు కు హితవు పలికింది.

Next Story
Share it