Telugu Gateway
Telangana

నా ఉద్దేశం అది కాదు

నా ఉద్దేశం అది కాదు
X

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ 'వర్షాల వివాదం'పై క్లారిటీ ఇచ్చారు. ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఐదేళ్ళ పాటు వర్షాలు పడొద్దని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ప్రకటించి అందరిని షాక్ కు గురిచేసింది. అంతే కాదు ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంత మంది అయితే ఏకంగా క్లిప్ ను మంత్రి కెటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ఇదేనా మీ పరిపాలన అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే వరదల ఆపటం చేతకాదని ఒప్పుకుంటున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.

ఈ వ్యవహారం పెద్ద అవుతుండటంతో విజయలక్ష్మీ రంగంలోకి దిగారు. ఈ మేరకు వివరణ ఇఛ్చారు. 'నగరంలో వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు పడ్డాయని, అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పడమే తన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. దాన్ని కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో వరదలు రావొద్దన్నదే తన ఉద్దేశం తప్ప, అస్సలు వర్షాలు రావొద్దని కాదన్నారు'.

Next Story
Share it