Telugu Gateway
Telangana

పోలీస్ కేసు నమోదు

పోలీస్ కేసు నమోదు
X

కొంత మంది సెలబ్రిటీ లకు డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత ఏమి చేయాలో అర్ధం అవుతున్నట్లు లేదు. పుట్టిన రోజు పార్టీ ల్లో చాలా మంది అలవాటు ఉన్న వాళ్ళు మద్యం సేవిస్తారు. ఫ్రెండ్స్, బంధువులకు మందు పార్టీ లు కూడా ఇస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే గత కొంత కాలంగా కొంత మంది సెలెబ్రిటీల పార్టీ లు దారి తప్పుతున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగర్ మంగ్లీ ఎంతో పాపులర్ అన్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు చేవెళ్లలోని ఒక రిసార్ట్ లో మంగ్లీ బర్త్ డే పార్టీ జరిగింది. ఇందులో అనుమతి లేకుండా విదేశీ మద్యం సరఫరా చేయటంతో పాటు కొంత మంది గంజాయి కూడా సేవించినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు మంగ్లీ తో పాటు రిసార్ట్ నిర్వాహకుల పై కూడా కేసు నమోదు చేసి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

ఈ బర్త్ పార్టీ కి సినిమా పరిశ్రమకు చెందిన కొంత మంది హాజరు అయినట్లు చెపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం సరఫరా చేయటంతో పాటు అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు పోలీసులు ఆ డీజ్ ను కూడా సీజ్ చేశారు. కొంత మంది పెద్ద సెలెబ్రిటీల బర్త్ డే పార్టీ ల్లో డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నట్లు గతంలో చాలానే వార్తలు వచ్చాయి. అయితే మంగ్లీ బర్త్ డే వేడుకల్లో 48 మంది వరకు కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిర్వహించిన టెస్ట్ లో 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెపుతున్న మాట.

Next Story
Share it