Telugu Gateway
Telangana

బ్లాక్ లిస్ట్ లో మంత్రి మల్లా రెడ్డి కాలేజీ

బ్లాక్ లిస్ట్ లో మంత్రి మల్లా రెడ్డి కాలేజీ
X

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి షాక్. నకిలీ డాక్యుమెంట్లతో తమ కాలేజీల గ్రేడ్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. దీంతో మల్లారెడ్డికి చెందిన కాలేజీకి నేష‌న‌ల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేష‌న్ కౌన్సిల్ (న్యాక్‌) షాక్ ఇచ్చింది. కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై 5 సంవత్సరాలు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్‌సెట్‌ ద్వారా వెల్లడించింది. ఈ వ్యవహారంలో అసలు ఏమి జరిగింది అంటే మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. అయితే ఇంకా మంచి గ్రేడ్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే ప్రయత్నిం చేసింది. న్యాక్ బెంగళూర్‌కు సెల్ఫ్ స్టడీ రిపోర్ట్‌ లో నకిలీ డాక్యూమెంట్లను జత చేసింది.

అయితే.. న్యాక్ కౌన్సిల్ ఈ విషయాన్ని గుర్తించింది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం చీటింగ్‌కు పాల్పడిందంటూ ఆ కాలేజీపై చర్యలకు ఉపక్రమించింది. అక్రిడేషన్ విషయంలో 5 సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. దీంతో రానున్న ఐదేళ్ల పాటు అక్రిడేషన్‌ కోసం ధరఖాస్తు చేసుకునే అవకాశాన్ని మల్లారెడ్డి కాలేజీ కోల్పోయింది. తెలంగాణ సర్కారు కొద్ది రోజుల క్రితమే మంత్రి మల్లారెడ్డికి ప్రైవేట్ యూనివర్శిటీ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it