Telugu Gateway
Telangana

స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు

స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఇది మహేష్ 29 వ సినిమా. పాన్ ఇండియా లెవల్ మించి మరీ ఈ సినిమా ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది. సోమవారం నాడు మహేష్ బాబు, నమ్రతతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏభై లక్షల రూపాయల చెక్ ను మహేష్ బాబు, నమ్రతలు సీఎం రేవంత్ రెడ్డి కి అందచేశారు.

ఈ ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. దీనికి ప్రధాన కారణం పొడవాటి జుట్టు, ఫుల్ గడ్డంతో ఆయన కనిపించటమే. రాజమౌళి సినిమా కోసమే మహేష్ బాబు ఈ లుక్ తో రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రాజమౌళి మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయటం లేదు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది భావిస్తున్నారు.

Next Story
Share it