Telugu Gateway
Telangana

స‌ర్కారు సాయం కోరిన హైద‌రాబాద్ మెట్రో

స‌ర్కారు సాయం కోరిన హైద‌రాబాద్ మెట్రో
X

కరోనా కార‌ణంగా హైద‌రాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తున్నదని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కెసీఆర్ ని ఈ సందర్భంగా కోరారు. ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో మెట్రో రైలు కు సంబంధించిన రవాణా, తదితర అంశాలు చర్చించిన సిఎం కెసీఆర్, వారి అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించారు. మెట్రో రైలుకు సంబంధించి, ఎల్ అండ్ టీ సంస్థకు, ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సిఎం సూచించారు.

ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించి తనకు నివేదికను అందచేయాలని సిఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించార‌ని సీఎంవో వెల్ల‌డించింది. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎల్ అండ్ టి సంస్థ అధికారులకు సిఎం తెలిపారు.కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవాణా అంశం పై చర్చించేందుకు శుక్రవారం ప్రగతి భవన్ లో ఎల్ అండ్ టీ సంస్థ సీఈవో & ఎండీ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం సిఎం కెసిఆర్ తో సమావేశమయ్యారు.

Next Story
Share it