Telugu Gateway
Telangana

భూ వినియోగ మార్పిడి ఫైళ్లకు కోట్లలో వసూళ్లు ?

భూ వినియోగ మార్పిడి ఫైళ్లకు కోట్లలో  వసూళ్లు ?
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చూస్తున్న మున్సిపల్ శాఖలో అవినీతి ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బిఆర్ఎస్ హయాంలో కంటే ఇప్పుడు మున్సిపల్ శాఖలో అవినీతి కొత్త కొత్త రికార్డు లకు చేరుతోంది అని ఆ శాఖ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా భూ వినియోగ మార్పిడి ఫైల్స్ కు సంబంధించిన అవినీతి వ్యవహారం భరించలేని స్థాయికి వెళ్ళింది అని రియల్ ఎస్టేట్ వర్గాలు చెపుతున్నాయి. పోనీ ఎకరాలకు ఎకరాలు ఉన్న ఫైల్స్ కు సంబంధించి కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అంటే కొంతలో కొంత అర్ధం చేసుకోవచ్చు అని...కానీ చిన్న చిన్న సైజు ల్లో భూములకు సంబదించిన ఫైల్స్ కు కూడా కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుండంతో కొంత మంది అసలు ఈ ఫైల్స్ గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉంది అని చెపుతున్నారు. గత బిఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి ఫైల్స్ కు డబ్బులు తీసుకునే వారు అని...కానీ ఇప్పుడు అది ఒక రేంజ్ కు వెళ్ళింది అని ఒక బాధిత వ్యక్తి వెల్లడించారు.

అయితే తాము వసూలు చేసే మొత్తంలో సింహ భాగం పెద్దలకు వెళుతుంది అని చెప్పి ఒక వ్యక్తి మున్సిపల్ శాఖకు చెందిన ఈ ఫైల్స్ దందా అంతా చూస్తున్నట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం అంతా మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలిసి జరుగుతున్నాయో లేదో అర్ధం కావటం లేదు అని...అయితే ఇంత భారీ స్థాయిలో సాగుతున్న వ్యవహారం ఆయన దృష్టికి వెళ్లకుండా ఉండే అవకాశం కూడా ఉండదు అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.

భూ వినియోగ మార్పిడి ఫైల్స్ క్లియరెన్స్ కు ఒక కమిటి ఉంటుంది. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధి లో ఉండే భూములకు మున్సిపల్ శాఖ అనుమతి ఎంతో కీలకం. ఆ కమిటి ముందుకు వెళ్లాలంటే ఇక్కడ కోట్లు సమర్పించుకుని ఫైల్ కియరెన్సు చేయించుకోవాల్సి వస్తోంది అని చెపుతున్నారు. అసలే గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ మాత్రం ఆశాజనంగా లేక డెవలపర్లు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని...ఈ తరుణంలో స్వయంగా సీఎం చూస్తున్న మున్సిపల్ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ వినియోగ మార్పిడి ఫైల్స్ ఒక్కటే కాకుండా ఇతర అనుమతుల విషయంలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది అని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. దీంతో అధికారంలో ఎవరు ఉన్నా మున్సిపల్ శాఖలో మాత్రం అవినీతి కామన్ అన్న చందంగా పరిస్థితి మారింది.

Next Story
Share it