వరద నీళ్లలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు
BY Admin15 July 2021 12:27 PM IST

X
Admin15 July 2021 12:27 PM IST
హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. బుధవారం నాడు రోజంతా కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో పలు చోట్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లపై కూడా నీళ్లు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. చివరకు ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు నీళ్ళలో..రోడ్డుపైన చిక్కుకుపోయింది.
భద్రతా సిబ్బందితోపాటు స్థానికుల సాయంతో ఎలాగోలా కారును బయటకు నెట్టారు. ఇందులో ఎమ్మెల్యే కూడా ఓ చేయి వేయాల్సి వేయాల్సి వచ్చింది. హస్తినాపురంలోని సాగర్ ఎన్ క్లేవ్ లో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్ంఎంసీ సిబ్బంది వరద నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
Next Story



