Telugu Gateway
Telangana

కేటీఆర్ ట్వీట్ ..ఏసీబీ కోర్ట్ ..అంతా తుస్...సీన్ రివర్స్ కొడుతుందా!?

కేటీఆర్ ట్వీట్ ..ఏసీబీ కోర్ట్ ..అంతా తుస్...సీన్ రివర్స్ కొడుతుందా!?
X

అధికార పార్టీ. ఏదైనా పని చేస్తే దానికి పక్కా ఆధారాలు ఉండాలి. కానీ తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీ అందుకు రివర్స్ లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. గురువారం ఉదయం అంతా బీజేపీ ప్రలోభాల తీరుకు నిరసనగా అంటూ రాష్ట్రంలో చాలా చోట్ల ఆందోళనలు చేసింది. ఏకంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు కూడా కాల్చారు. దీనికి పోటీగా బీజేపీ కూడా ఆందోళనలకు దిగింది. మరి టిఆర్ఎస్ ఎలాంటి ఆధారాలు లేకుండానే అధికార పార్టీ అయి ఉండి ఆందోళనలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం అన్న చర్చ నడుస్తోంది. ఉదయం అంతా ఆందోళనలు చేసి సాయంత్రానికి సీన్ రివర్సు చేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం చేసిన ట్వీట్ తో అంతా తుస్సు అన్నట్లు అయింది అన్న చర్చ టిఆర్ఎస్ నేతల్లో సాగుతోంది. అయన ట్వీట్ సారాంశం ఇలా ఉంది. 'ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ రాశారు. దీనితో ఒక్కసారి గా అధికార పార్టీ ఇరుకున పడినట్లు కనిస్పిస్తోంది అని పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ప్రాధమిక దశలో ఉన్న సమయంలో అధికార పార్టీ ప్రజలను ఇబ్బంది పెడుతూ ధర్నాలు, నిరసనలు చేయవచ్చా అన్న విమర్శలు వస్తున్నాయి.

కేటీఆర్ ట్వీట్ పార్టీ శ్రేణులకు ఒక షాక్ అయితే..రాత్రి ఏసీబీ కోర్ట్ కూడా అవినీతి నిరోధక కేసు నమోదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనందున రిమాండుకు నో చెప్పింది. ఒక వైపు పక్కా ఆదారాలు ఉన్నాయి వీడియో లు.. ఆడియోలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తూ కోర్ట్ కు ఎందుకు పక్కా ఆధారాలు ఇవ్వలేకపోయారు అన్న డౌట్ రావటం సహజమే కదా. తొలుత అసలు మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో వందల కోట్ల నగదు కట్టలు..గుట్టలు అని ప్రచారం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఇంత వరకు అక్కడ ఒక్క రూపాయి కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పలేదు. ఏకంగా అధికార పార్టీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తే..పోలీసులు ఇంత వరకు దీనిపై సమగ్ర సమాచారం ఇస్తూ మీడియా సమావేశం పెట్టక పోవటం పై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఇది అధికార పార్టీ కే రివర్స్ కొట్టేలా ఉండనే అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. అంతా మాత్రాన బీజేపీ అసలు ఇలాంటి పనులు చేయదు అని ఎవరు సర్టిఫికెట్స్ ఇవ్వరు. కానీ తెలంగాణ లో తాజా గా జరిగిన ఎపిసోడ్ లో మాత్రం బీజేపీ ని ఇరుకున పెట్టాలని చూసి...అధికార టిఆఎస్ చిక్కుల్లో పడిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసు లో నిజంగా ఆధారాలు ఉంటే కోర్ట్ కి ఇవ్వాలి కానీ ఢిల్లీ లో మీడియా సమావేశం పెడతారని వార్తలు రావటం మరో కీలక పరిణామంగా మారింది. పోలీస్ లు అరెస్ట్ చేసిన వారిలో ఎవరూ నేరుగా బీజేపీ నేతలు లేరు. కానీ చర్చలకు వెళ్లిన వారిలో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే సమయంలో పోలీసులు ఎమ్మెల్యేలు ఇచ్చిన పిర్యాదు మేరకు రైడ్ చేశామని చెప్పారు. మరి ఈ రైడ్ లో నగదు ఏమి దొరకలేదా..ఎందుకు దీనిపై ఇంకా మౌనంగా ఉంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి..ఏ అంశంపై అవినీతి ఆరోపణలు చేసిన సీఎం కెసిఆర్, మంత్రి కేటిఆర్ లు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం విచారణ ప్రాధమిక దశలోనే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ధర్నాలు, ఆందోళనలు చేస్తారన్న మాట.

Next Story
Share it