చూడని వాళ్ళు చూడండి..హాట్ టాపిక్ గా మారిన కెటీఆర్ లింక్ షేర్!
ఆయనో మంత్రి. అంతే కాదు అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా.ప్రభుత్వంలో అనధికార నెంబర్ టూ స్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి మంత్రి కెటీఆర్ టీవీ 9 కి తాను ఇచ్చిన ఇంటర్వ్యూ ను స్వయంగా ప్రమోట్ చేసుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మంత్రి కెటీఆర్ ఎప్పుడు ఇలా చేయాలేదు అని పార్టీ నాయకులు కూడా చెపుతున్నారు. కెటీఆర్ సోమవారం ఉదయం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు . అదేంటి అంటే టీవీ 9 లైవ్ షో ఎవరు అయితే చూడలేదో వారి కోసం ఈ లింక్ అంటూ ఆ ఛానల్ లింక్ షేర్ చేశారు. సహజంగా చిన్న చిన్న లీడర్లు ఇలా పెట్టు కుంటారు అని..కానీ కెటీఆర్ తొలి సారి ఇలా ఎందుకు చేశారు అన్నది ఆశ్చర్యంగా ఉందని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారటం తో ఎంత వీలు అయితే అంత ప్రచారం చేసుకునే పనిలో ఉంది అధికార పార్టీ.
కెటీఆర్ గత కొన్ని రోజులుగా వరసపెట్టి పత్రికలూ..టీవీ చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా తో విడిగా మాట్లాడం మానేసి చాలాకాలమే అవుతుంది. విలేకరుల సమావేశాలు పెడతారు కానీ ..ఇంటర్వూస్ డ్యూటీ అంతా మంత్రి కెటీఆర్ కె అప్పగించినట్లు ఉంది. బీజేపీ విషయంలో తమ వాదన ఎంత వీలు అయితే అంతా ప్రజల్లోకి పంపాలనే తపనతోనే ఇలా చేసి ఉంటారనే వ్యాఖలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కెటీఆర్ ట్విట్టర్ లో తన ఇంటర్వ్యూ లింక్ షేర్ చేయటం చర్చనీయాంశగా మారింది. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఫుల్ యాక్టీవ్ గానే ఉంటది. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.