Telugu Gateway
Telangana

కెటిఆర్ లేకపోతే హైదరాబాద్ దివాళా తీసేది

కెటిఆర్ లేకపోతే హైదరాబాద్ దివాళా తీసేది
X

ఒక వైపు బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏమో తమకు కేంద్రంలో అధికారం అప్పగిస్తే ఇండియాను అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికాను దాటేలా చేస్తానంటున్నారు. మరి ఇదే బిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇప్పటికే అమెరికా కంటే హైదరాబాద్ బాగుంది అని చెపుతున్నారు. తాజాగా అయన పలు కీలక వ్యాఖలు చేశారు. నేను మొన్న అమెరికా పోయా. హైదరాబాద్ కన్నా పెద్ద గొప్పగా ఏమిలేదు. ఇవాళ అమెరికా కన్నా కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లోనే చాలా బాగున్నాయి. అయన అక్కడితో ఆగలేదు. ఇవాళ కెటిఆర్ కనక లేకపోతే హైదరాబాద్ మిగతా రాష్ట్రాల కన్నా దివాళా తీసేది.

మిగతా రాష్ట్రాలకు మీరు ఎప్పుడన్నా పోండి,,,హైదరాబాద్ పడమట వైపు పోండి నాకే కళ్ళు తిరుగుతాయి. నేను అప్పుడప్పుడు పోతుంటే అసలు నేను హైదరాబాద్ లో ఉన్ననా లేక సింగపూర్ లో ఉన్ననా..లేకపోతే మలేసియా లో ఉన్ననా..లేక అమెరికాలో ఉన్ననా అనిపిస్తది అంటూ వ్యాఖ్యానించారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. తన నియోజవర్గంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పులు చేస్తే మీకు బాధ ఏంటి అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. టైం ప్రకారం ఖాతాల్లో రైతు బందు పడుతుందా లేదా అని ప్రశ్నించారు. ఓట్లే లేవు కానీ. బీజేపీ వాళ్ళు తాము గెలుస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Next Story
Share it