Telugu Gateway
Telangana

గ‌వ‌ర్న‌ర్ ఏదో ఊహించుకుంటే ఏమీ చేయ‌లేం

గ‌వ‌ర్న‌ర్ ఏదో ఊహించుకుంటే ఏమీ చేయ‌లేం
X

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై ఢిల్లీ వేదిక‌గా చేస్తున్న వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఆమె మాట‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు టీఆర్ఎస్ మంత్రులు కౌంట‌ర్ ఇస్తున్నారు. ఆమె రాజ్ భ‌వ‌న్ లోకి రాజ‌కీయాలు జొప్పిస్తున్నార‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. అంతే కాదు..ఆమె ఫైళ్ల క్లియ‌రెన్స్ లోనూ జాప్యం చేశార‌ని..ఆమె ఎవ‌రి ప్రోద్భ‌లంతో ఇలా చేస్తున్నారో అంటూ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో మంత్రి కెటీఆర్ కూడా గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని కేటీఆర్‌ తెలిపారు. గవర్నర్‌ అంటే తమకు గౌరవం ఉందని, ఆమెను ఎక్కడా అవమానించలేదని స్పష్టం చేశారు. గవర్నర్‌ తనకు తానే ఊహించుకోకూడదని సూచించారు. గవర్నర్‌కు ఎక్కడ అవమానం జరిగిందో వెల్లడించాలని తెలిపారు. తనను ఇబ్బందిపెడుతున్నారని గవర్నర్‌ అంటున్నారని, అందంతా అవాస్తవమని కేటీఆర్‌ అన్నారు.'కౌశిక్ రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ ఆమోదం తెలపలేదని తెలిసింది .గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు కాదా. గవర్నర్ అయ్యేందుకు రాజకీయాలు కావాలి కానీ ఎమ్మెల్సీకి ఎందుకు అడ్డు అవుతాయి.

గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు మాకు ఏ పంచాయితీ లేదు. ఇప్పుడు ఎందుకు సమస్య వస్తుంది' అని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పంపగా.. గవర్నర్ ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారు. అప్పటి నుంచి రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదం రాజుకున్నట్లు, గవర్నర్‌, కేసీఆర్‌ మధ్య గ్యాప్‌ పెరిగిపోయిందని సమాచారం. ఆ తర్వాత కూడా ఏ కార్యక్రమంలోనూ ఇద్దరు కలిసి పాల్గొనకపోవడంతో కేసీఆర్‌ గవర్నర్‌ను దూరం పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని త‌మిళ్ సై ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, రాజ్‌భన్‌ను గౌరవించాలన్నారు.

Next Story
Share it