Telugu Gateway
Telangana

న‌దుల‌కు న‌డ‌క నేర్పిన నాయ‌కుడు కెసీఆర్

న‌దుల‌కు న‌డ‌క నేర్పిన నాయ‌కుడు కెసీఆర్
X

ఏభై వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెను చేరింది

బిజెపి, కాంగ్రెస్ ల‌కు తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటీఆర్ స‌వాల్ విసిరారు. దేశంలో ఏ రాష్ట్రం అయినా వ్యవసాయం, అనుబంధ విభాగాలకు 2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్ నుంచి తాను స‌వాల్ విసురుతున్నాన‌ని, దమ్ముంటే రైతులకు వేరే రాష్ట్రాల్లో ఎంత‌ మేలు ఏదైనా చేశారో చెప్పండి. చర్చకు సిద్ధం అన్నారు. కెటీఆర్ సోమ‌వారం నాడు హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ పర్యాటకులు వస్తే అభ్యంతరం లేద‌ని, తెలంగాణ పర్యాటక రంగానికి అది మేలు చేస్తుండొచ్చని ఎద్దేవా చేశారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు .గణాంకాలు ఉంటే చెప్పండన్నారు. రైతు బంధు ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం మామూలు విషయం కాదు...ఇది ఒక సాహసం అన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో రైతులకు అన్నీ కష్టాలే అన్నారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ వరస క్రమం లో మొదటి స్థానమే కాదు.. రైతుల ఆత్మ హత్యల్లో కూడా మొదటి స్థానం.

దిగుబడుల్లో చివరి స్థానంలోఉంద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక వలసల దుస్థితి పోయింద‌ని, రైతుల దర్జా పెరిగిందన్నారు. భూముల ధరలు, రియల్ ఎస్టేట్ బూమ్ లో ఉంద‌న్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం లో సాధించిన విజయాలు ట్రైనీ ఐఎస్ లకు పాఠ్యంశాలు గా మారాయని కెటీఆర్ వ్యాఖ్యానించారు. కోటి ఎకరాల మాగాణే కాదు ..ముక్కోటి టన్నుల ధాన్యగారం గా తెలంగాణ మారిందని, ఎఫ్ సీఐ గోడౌన్ల లో పట్టనంత ధాన్యం వ‌స్తుంది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. రైతు బంధుతో 50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెను చేరిందని తెలిపారు. కేంద్రం నుంచి అరపైసా సాయం లేకున్నా కాలం తో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామ‌ని తెలిపారు. నదులకు నడక నేర్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

Next Story
Share it