Telugu Gateway
Telangana

కేటీఆర్ పై కెసిఆర్ గరం గరంగా ఉన్నారా ?!

కేటీఆర్ పై కెసిఆర్ గరం గరంగా ఉన్నారా ?!
X

ఆ యాడ్ లో మంత్రి కేటీఆర్ ఎందుకు మిస్ అయ్యారు?

తెలంగాణ అధికారుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రభుత్వం గురువారం నాడు పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. హైదరాబాద్ నగరం వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022 గెలుచుకుంది అన్నది ఈ యాడ్ సారాంశం. ఇందులో జిహెచ్ఎంసి , హెచ్ఎండీఏ లోగోలను ప్రముఖముగా, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగో ఉంచారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే జిహెచ్ఎంసి , హెచ్ఎండీఏ రెండు విభాగాలు కెసిఆర్ తనయుడు, మున్సిపల్ శాఖ మంత్రి కే టీ ఆర్ పరిధిలోనివి. ఈ ఫుల్ పేజీ యాడ్ మొదటిసారి మంత్రి కే టీ ఆర్ ఫోటో లేకుండా ఒక్క సీఎం కెసిఆర్ ఫోటో తోనే ఇది వచ్చింది. దీంతో అధికార వర్గాల్లో అసలు ఏమి జరిగి ఉంటదనే చర్చ సాగుతోంది. సీఎం కెసిఆర్ మంత్రి కే టీ ఆర్ ఫోటో ఎందుకు వద్దన్నారు..దీని వెనక కారణాలు అరా తీసే పనిలో ఉన్నారు కొంతమంది. అధికారులు వారంతట వారు మంత్రి ఫోటో పెట్ట కుండా ఉండే సాహసం అసలు చేయరు అన్న డిస్కషన్ నడుస్తోంది.

ఐ అండ్ పీ ఆర్ శాఖ తెలంగాణ లో ఎప్పటి నుంచో సీఎం కెసిఆర్ వద్దే ఉంది. అయన ఆదేశాలు లేకుండా అక్కడా ఏమి జరగదు. అన్ని శాఖల్లోనూ అలాగే ఉన్న ఇక్కడ మరి ముఖ్యం అని చెప్పొచ్చు. హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022 అవార్డు వచ్చినా మంత్రి తో పాటు అధికారులు ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవటంలో విఫలమయ్యారనే కోపం తో సీఎం కెసిఆర్ ఉన్నారని ..అందుకే మంత్రి ఫోటో లేకుండానే యాడ్ విడుదల చేశారనే ప్రచారం సాగుతోంది అధికారుల్లో. ఒక్క సీఎం ఫోటోతో ఫుల్ పేజీ ప్రకటన విడుదల ఈ ఒక్క యాడ్ తోనే ఆగిపోతుందా లేక రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిస్తరా అన్నది వేచి చూడాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం ఈ శాఖ యాడ్ ఇచ్చిన కూడా సీఎం కెసిఆర్ తో పాటు మంత్రి ఫోటో తప్పనిసరి గా పెడతారు. ఈ సారి అది మిస్ అయింది.

Next Story
Share it