Telugu Gateway
Telangana

ఆవో-దేఖో-సీకో

ఆవో-దేఖో-సీకో
X

బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు వేదికైన హైద‌రాబాద్ లో ఇప్పుడు హాట్ హాట్ వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది.అధికార టీఆర్ఎస్, బిజెపిల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. ఇప్ప‌టికే ఒక‌రిపై ఒక‌రు ఫ్లెక్సీ వార్ చేసుకుంటున్నారు. చివ‌ర‌కు హోర్డింగ్ లు చించుకునే వ‌ర‌కూ ప‌రిస్థితి వెళ్లింది. మ‌రి బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌రిగే ఈ రెండు రోజుల్లో ఇంకా ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది . టీఆర్ఎస్ విమ‌ర్శ‌ల‌కు జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల వేదిక‌గా బిజెపి ఎలా కౌంట‌ర్ ఇవ్వ‌బోతుంది అన్న‌ది వేచిచూడాల్సిందే. ఈ త‌రుణంలో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ తాజాగా ప్ర‌ధాని మోడీకి ఓ లేఖాస్త్రం సంధించారు. అందులోనూ ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాని నరేంద్రమోదీకి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు.

'జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడండి. పార్టీ డీఎన్‌ఏలో విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలు చర్చిస్తారనుకోవడం అత్యాసే అని తెలుసు.'' అని లేఖలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.''అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం ఉందనుకోవడం లేదు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభానికి తెలంగాణకు మించిన ప్రదేశం మరొకటి లేదు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు, పథకాలు, పాలనా విధానాలు అధ్యయనం చేయండి. డబుల్‌ఇంజిన్‌తో ప్రజలకు ట్రబుల్‌గా మారిన మీ రాష్ట్రాల్లో అమలు చేయండి. తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి.'' అంటూ లేఖలో కేటీఆర్‌ హితవు పలికారు.

Next Story
Share it