కండ్లకోయ ఐటి పార్కుకు కెటీఆర్ శంకుస్థాపన

తెలంగాణ సర్కారు హైదరాబాద్ నలుదిశలా ఐటి రంగాన్ని విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. గురువారం నాడు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కండ్లకోయలో ఐటీ పార్క్‌ను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కేసీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ఎన్నికలో ఓడిపోయారన్నారు. ఓటమితో నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. పట్టువిడవని పోరాటంతో తెలంగాణను సాధించారని పేర్కొన్నారు.
ఒకవేళ కేసీఆర్ రాజకీయాలను వీడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించేవాళ్లమా? అని ప్రశ్నించారు. ఐటీ పార్క్‌తో కండ్లకోయ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే టాప్-5 కంపెనీలు, క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. అతిపెద్దదైన ఎత్తిపోతల పథకాన్ని మూడున్నరేళ్లలోనే నిర్మించామని చెప్పారు. మేడిగడ్డ నుంచి మేడ్చల్ వరకు గోదావరి జలాలు తీసుకోవచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు.