Telugu Gateway
Telangana

రేవంత్ ను కెటిఆర్ కావాలనే వదిలేశారా?!

రేవంత్ ను కెటిఆర్ కావాలనే వదిలేశారా?!
X

కెటిఆర్ వ్యాఖలు బిఆర్ఎస్ కే నష్టం

ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేగా?

తెలంగాణ ప్రభుత్వం పై ఎవరైనా అవినీతి ఆరోపణలు చేస్తే మంత్రి కెటిఆర్ ముందు చెప్పే మాట ఆధారాలు ఉంటే మాట్లాడాలి...ఆధారాలు చూపించి మాట్లాడాలి అని. మరి అయన గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎంపీ, పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు..రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అంటూ హైదరాబాద్ శివారు భూములపై సెపరేట్ దుకాణం పెట్టారని...దందాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆర్టిఐ పేరుతో కూడా దందా చేస్తున్నారు అని చెప్పారు. కెటిఆర్ లెక్కల ప్రకారం అయన నిజంగా ఇవన్నీ కూడా పక్కా ఆధారాలతో మాట్లాడిన మాటలు అయితే కెసిఆర్ సర్కారు ఎందుకు ఇంత వరకు రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోలేదు...లేదంటే సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు కావాలనే రేవంత్ ను వదిలేశారా అన్న ప్రశ్నలు రావటం ఖాయం అని బిఆర్ఎస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కొన్ని సార్లు మంత్రి కెటిఆర్ మాటలు పార్టీ ని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయని...అసెంబ్లీ సాక్షిగా ఇంత సంచలన ఆరోపణలు చేసి ప్రభుత్వం వదిలేసింది అంటే ప్రజలకు ఎలాంటి సంకేతం వెళుతుంది అని ఒక సీనియర్ నేత ప్రశ్నించారు.

కెటిఆర్ దగ్గర రేవంత్ విషయంలో ఆధారాలు లేక పోతే అటు ప్రభుత్వం విషయం లో అయినా..ఇటు బయట వ్యక్తుల విషయంలో అయినా అవినీతిని నిరూపించటం అంతా తేలిక కాదు అని అంగీకరించినట్లు అవుతుంది అనే సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది అని చెపుతున్నారు. కెటిఆర్ ఆరోపణలపై స్పందించిన రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జి తో విచారణకు తాను సిద్ధం..ఇందుకు కెసిఆర్ కుటుంబం సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. దీనిపై అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. మొత్తానికి అసెంబ్లీ వేదికగా కెటిఆర్ చేసిన కామెంట్స్ తప్పులు చేసిన వాళ్ళను కూడా ఈ ప్రభుత్వం ఏమి చేయలేక పోతుంది..ఏమి చేయలేదు అనే అభిప్రాయం కలిగించేలా ఉంది అని చెపుతున్నారు. ఇదే సీఎం కెసిఆర్ మాజీ పీసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మంత్రిగా ఉన్న సమయంలో భారీ స్కాం చేసారని...రెండవ సారి అధికారంలోకి వచ్చాక వాళ్ళను వదిలిపెట్టే ప్రశ్న లేదని బహిరంగ సభలో ప్రకటించారు. రెండవ టర్మ్ కూడా మరి కొద్దీ నెలల్లోనే ముగియనుంది. కానీ ఇప్పటివరకు చర్యలు ఏమి లేవు. ఈ స్కాం ను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ది పొందటానికి ప్రయత్నించారు అనే ఆరోపణలు ఉన్నాయి.

Next Story
Share it