Telugu Gateway
Telangana

జ‌గ‌న్ కు స‌రెండ‌ర్ అయిన కెసీఆర్

జ‌గ‌న్ కు స‌రెండ‌ర్ అయిన కెసీఆర్
X

ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అత్యంత కీల‌క‌మైన కృష్ణా జ‌లాల కేటాయింపులు ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాల్సిందే అంటూ వాదించిన ముఖ్య‌మంత్రి కెసీఆర్, తెలంగాణ మంత్రులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. బుధ‌వారం నాడు జ‌రిగిన కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు స‌మావేశంలో ఆరు సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన ఒప్పందంపైనే మ‌ళ్ళీ ఎందుకు సంత‌కం చేశార‌ని ప్రశ్నించారు. స్వ‌యంగా సాగునీటి శాఖ‌ను చూస్తున్న సీఎం కెసీఆర్ అత్యంత కీల‌క‌మైన స‌మావేశం ప‌ట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లి నామా నాగేశ్వ‌ర‌రావు ఇచ్చిన విందులో పాల్గొన‌టం ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంకేతం ఇచ్చార‌న్నారు.కృష్ణా జ‌లాల విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ తో కుమ్మ‌క్కు అయ్యారా? లేక జ‌గ‌న్ కు స‌రెండ‌ర్ అయ్యారా అని ప్ర‌శ్నించారు. తెలంగాణకు 34 శాతం, ఏపీకి 64 శాతం నీటి కేటాయింపుల‌కు అంగీక‌రిస్తూ బుధ‌వారం నాడు జ‌రిగిన స‌మావేశంలో సంంత‌కాలు చేశార‌న్నారు. దీంతో ఆరు సంవ‌త్స‌రాల నుంచి కెసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఏ విధంగా ద‌గా చేస్తున్నాడో అన్న విష‌యం మ‌రోసారి నిరూపితం అయింద‌న్నారు. 811 టీఎంసీల్లో 50 శాతం నిక‌ర జాలాల‌ను తెలంగాణ ప్రాజెక్టుల‌కు కేటాయించాల్సిందే అన్నారు. టీఆర్ఎస్ నేత‌లు కేంద్రంపై యుద్దం చేస్తామ‌న్నారు.

పార్ల‌మెంట్ స‌మావేశాల ముందుకు కూడా సీఎం కెసీఆర్ కృష్ణా జ‌లాల కేటాయింపుల్లో అన్యాయం జ‌రిగింది కొట్లాడ‌తాం అన్నార‌ని, కానీ చివ‌ర‌కు సెంట్ర‌ల్ హాలులో చాయ్ బిస్కెట్లు తిని మోడీకి మ‌ద్ద‌తు ప‌లికార‌ని ఎద్దేవా చేశారు. మోడీని ఎంపీ సంతోష్ రావు ర‌హ‌స్యంగా క‌లిశార‌ని, ఇత‌ర ఎంపీలు కూడా ఉన్నార‌న్నారు. కానీ ఒక్క మాట కృష్ణా జ‌లాల జ‌లాల‌పై మాట్లాడ‌లేద‌ని తెలిపారు. మోడీకి అండ‌గా నిల‌బ‌డి..త‌లంగాణ ప్ర‌లజ‌ను నిట్ట‌నిలువుగా నిండా ముంచార‌ని విమ‌ర్శించారు. కోట్లాది మంది తెలంగాణ రైతుల‌పై మ‌ర‌ణ‌శాస‌నం కృష్ణా జ‌లాల రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు స‌మావేశంలో జ‌రిగితే. ఒక్క రోజు ముందే ఢిల్లీ వెళ్ళి నామా ఇంట్లో విందుకు వెళ్ళాల్సిన అవ‌స‌రం ఉందా?.ఇంత కీల‌క స‌మావేశం ఇక్క‌డ ఉంది. జ‌ల‌విద్యుత్ చేయాలా వద్దా అన్న‌ది చాలా చిన్న స‌మ‌స్య‌. నీటి కేటాయింపుల అంశాన్ని ప‌క్క‌న పెట్టి చిన్న స‌మ‌స్య పై..లేని వివాదాన్ని లేపారని ధ్వ‌జ‌మెత్తారు. అధికారులు నిజంగా స‌మ‌ర్ధ‌వంతంగా తెలంగాణ రైతుల కోసం వాద‌న‌లు విన్పించి ఉంటే కెసీఆర్ గుండెచ‌ప్పుడు న‌మ‌స్తే తెలంగాణ‌లో దీనికి ప్రాధాన్య‌త ఏది అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it