Telugu Gateway
Telangana

కౌశిక్ నోట వ‌చ్చింది కెసీఆర్..కెటీఆర్ మాట‌లే

కౌశిక్ నోట వ‌చ్చింది కెసీఆర్..కెటీఆర్ మాట‌లే
X

హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిపై మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. స్థాయి తెలుసుకుని మాట్లాడాల‌న్నారు. కౌశిక్ నోట వ‌చ్చింది కెసీఆర్, కెటీఆర్ చిలుక‌ప‌లుకులే అన్నారు. హుజూరాబాద్ లో ఓట‌మి తప్ప‌ద‌ని తెలుసుకునే ఇలాంటి కోవ‌ర్టుల‌ను ప్ర‌యోగిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని తెలిపారు. కాంగ్రెస్ లో 2018 లో హుజురాబాద్ టికెట్ రావడం వల్లనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడ‌న్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీని పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులపై పీసీసీ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి, మాణికమ్ ఠాగూర్ లపై కౌశిక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని ఉత్త‌మ్ తెలిపారు.

Next Story
Share it