Telugu Gateway
Telangana

కోమటిరెడ్డి ఇక అంతేనా?!

కోమటిరెడ్డి ఇక అంతేనా?!
X

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖలు చేశారు. ఫలితాలు ఎలా ఉన్నాఎన్నికలకు ముందు ఎవరైనా తమ పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పుకుంటారు. కానీ అయన మాత్రం అందుకు బిన్నంగా సొంతంగా కాంగ్రెస్ గెలవటం కష్టమే అని చెప్పటం సంచలనంగా మారింది. ఒక వైపు పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తప్పనిసరిగా 60 సీట్లు వస్తాయని చెపుతున్నారు. కానీ కోమటిరెడ్డి మాత్రం తెలంగాణ లో ఈ సారి హంగ్ అసెంబ్లీ వస్తుంది అని..తన 35 ఏళ్ళ అనుభవం తో ఈ మాట చెపుతున్నా అని తెలిపారు. కోమటిరెడ్డి వ్యాఖలు అయన మాటల్లోనే ..‘నేను గెలిపిస్తా అంటే నలభై సీట్లు రావొచ్చు. సీనియర్లు అందరూ కలిసి పని చేస్తే 60 సీట్లు రావొచ్చు. హంగ్ అవకాశం ఉంది. సర్వే ల ప్రకారం చూస్తే. ఎన్నికల తర్వాత కలిస్తే బిఆర్ ఎస్ తో కలవాల్సి ఉంటది .

ఎందుకు అంటే బీజేపీ తో మేము కలవటం సాధ్యం కాదు కాబట్టి .సీనియర్ నాయకలు అందరు రకరకాల కారణాలతో ఒక్క తాటిపైకి రాలేక పోతున్నారు. కాంగ్రెస్ కు చాలా అవకాశాలు ఉన్నాయి . కానీ నా మనుషులు ..టికెట్ లు వాళ్ళకే అంటే కష్టం. గెలిచే వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాలి. కొత్త వాళ్ళు అయినా..పాత వాళ్ళు అయినా. ముందే అరవై నుంచి 70 సీట్లు ప్రకటించాలని రాహుల్ గాంధీ ని ముందే కోరా. కానీ ఈ దిశగా ఇప్పటికి ఎక్కడ చర్చ లేదు. నేను గెలిపించి ..నా భుజాలపై గెలిపించి చూపెడతా అంటే అంత పెద్ద లీడర్ కాంగ్రెస్ లో ఎవరూ లేరు. నేను ఎవరి పేరు చెప్పటం లేదు. కొత్త ఇంచార్జి వచ్చాక అంత సెట్ అయింది. అయన అందరి మాటలు వింటున్నారు. ’ అని వ్యాఖ్యానించారు. ముందు పొత్తులు ఎవరితో ఉండవన్నారు.

Next Story
Share it