కోమటిరెడ్డి వెంకటరెడ్డి 'నైని కోల్ బ్లాక్' అంశాన్ని వదిలేస్తారా?!
ఈ అంశంపై అవసరం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించటానికి కూడా వెనకాడబోనని ప్రకటించారు. ఇదే అంశంపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసి..సీబీఐ విచారణ కూడా కోరానన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థలకు కేంద్రం కాంట్రాక్ట్ లు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీతోపాటు టీఆర్ఎస్ కూడా విమర్శలు గుప్పిస్తోంది. అయితే అవి టెండర్లలో దక్కినవే తప్ప..పార్టీ మారినందుకు వచ్చినవి కావని రాజగోపాల్ రెడ్డి వివరణ ఇస్తున్నారు. ఈ తరుణంలో మరి ఎంపీ రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో నైని కోల్ బ్లాక్స్ అవినీతిపై పోరాడతారా?. లేక వదిలేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నైని కోల్ బ్లాక్స్ లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తుంటే..మరో వైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం బిజెపి అవినీతిని సహించదని ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలు ఎవరి మాటలు నమ్మాలి.