Telugu Gateway
Telangana

బీజేపీ, మోడీ పరువు తీసిన రాజగోపాల్ రెడ్డి !

బీజేపీ, మోడీ పరువు తీసిన రాజగోపాల్ రెడ్డి !
X

రాజకీయ నాయకులు ఎవరైనా తాము ఉన్న పార్టీ మేలు కోరుకుంటారు..ఆ పార్టీ కి నష్టం కలిగించే మాటలు మాట్లాడరు. పార్టీ మారదాం అనుకున్నప్పుడు మాత్రం వీళ్ళ మాటల్లో తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ఇందుకు భిన్నం అనే చెప్పొచ్చు. వీళ్ళు తాము ఉన్న పార్టీ లనే ఇరకాటంలోకి నెడుతుంటారు. తెలంగాణ బీజేపీ నూతన ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా మాట్లాడిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు తెలంగాణ బీజేపీలో దుమారం రేపుతున్నాయి. అయన మాటలు అటు బీజేపీ పరువు తీయటం తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు పరువు కూడా తీసినట్లు ఉన్నాయనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్నది ఎవరు..కెసిఆర్..కవిత ఉన్నారా లేదా.. ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారా..లేదా...ఈడీ అధికారులను మేనేజ్ చేసి...ఢిల్లీ కి పోయి మాయాజాలపు కెసిఆర్ ఏమి చేసిండో తెలియదు కానీ ఆమె బయటకు వచ్చింది. దాంతోటి ఏమి అంటున్నారు...బీజేపీ, బిఆర్ఎస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కెసిఆర్, ఆయన కొడుకును కూడా జైళ్లలో పెడుతుంది బీజేపీ పార్టీ. వదిలిపెట్టదు అంత ఈజీ గా. తొమ్మిదేళ్లు అధికారం ఉపయోగించి లక్షల కోట్లు దోచుకున్నావు కదా తప్పక ఒక రోజు వస్తది.కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నీ దిగుతాయి..ఆ రోజు తెలంగాణ ప్రజలు బీజేపీ కరెక్ట్ అని నమ్ముతారు అంటూ వ్యాఖ్యానించారు. మద్యం స్కాములో ఢిల్లీ కి వెళ్ళి కెసిఆర్ ఈడీ ని మేనేజ్ చేశారని బీజేపీ నాయకుడు మాట్లాడం ఒకెత్తు అయితే...ప్రధాని మోడీ పాలనలో ఈడీని ఎవరైనా మేనేజ్ చేయవచ్చు అనేలా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయటం ఏమిటో అర్ధం కావటం లేదు అని

ఆ పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిందే నిజం అయితే లిక్కర్ స్కాములో మేనేజ్ చేసిన కెసిఆర్ ...కేసు లు తన వరకు...తన కొడుకు వరకు వస్తే మేనేజ్ చేసుకోలేరా అని అయన ప్రశ్నించారు. అసలు రాజగోపాల్ రెడ్డి ఇవన్నీ ఎలా మాట్లాడారో ..ఎలా మాట్లాడనించారో అని మరో సీనియర్ నేత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవి అన్నీ కూడా బీజేపీ పరువు తీసేలా ఉన్నాయనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. కొద్దినెలల క్రితం జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదు అని...డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు అంటూ ప్రశ్నించారు. తనకు పీసిసి ప్రెసిడెంట్ పదవి ఇస్తే పాదయాత్ర చేద్దామనుకున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పటిలో . సీన్ కట్ చేస్తే మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలు కావటంతో ఆయన కూడా తర్వాత సైలెంట్ అయిపోయారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తర్వాత వెంకటరెడ్డి కూడా బీజేపీ లోకి వెళతారు అని అప్పటిలో బలంగా ప్రచారం జరిగింది. కానీ అక్కడ లెక్కలు అన్నీ తప్పాయి...కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటంతో పరిస్థి తి మరింత మారిపోయింది. అటు కాంగ్రెస్ లో ఉండి వెంకట రెడ్డి...ఇటు బీజేపీ లో ఉండి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీలను ఇరకాటంలోకి నెట్టడంతో బ్రదర్స్ ఎప్పుడూ ఇంతేనా అన్న చర్చ సాగుతోంది రాజకీయ వర్గాల్లో.

Next Story
Share it