ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నగరంలో ప్రతి ఏటా ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు శనివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. శనివారం రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసరప్రాంతాలు రద్దీగా మారిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరోవైపు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్రకు ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన క్రేన్లతోపాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాకి హైకోర్టు నో చెప్పటంతో సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ అనుమతి తెచ్చింది. అయితే అది కూడా ఈ ఒక్కసారికి మాత్రమే అనే షరతుతో ఇచ్చారు. నిమజ్జన ప్రక్రియ అంతా సీసీటీవీ నిఘాలో సాగనుంది.