Telugu Gateway
Telangana

గోరేటి వెంక‌న్న‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

గోరేటి వెంక‌న్న‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
X

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంక‌న్న‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ద‌క్కింది. ఆయ‌న ప్రముఖ ప్రజాకవి, జానపద గాయకుడుగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు. 'వల్లంకి తాళం' కవితా గేయ రచనకు గాను వెంకన్నకు ఈ అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి కవిత్వ విభాగంలో వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్టు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి ఏటా 20 భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి అవార్డులు ప్రకటించడం ఆనావాయితీ వస్తోంది. 2016లో తెలంగాణ ప్రభుత్వం వెంకన్నకు కాళోజీ పురస్కారం అందించింది. 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును ప్రదానం చేసింది.

తెలంగాణ పాటను విశ్వవ్యాప్తం చేసిన గోరేటి వెంకన్నకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో "కబీర్‌ సమ్మాన్‌' పురస్కారం ప్రదానం చేసింది. ఆయన రాసిన పాట 'పల్లె కన్నీరు పెడుతోందో.. కనిపించని కుట్రల' దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసి.. పాటిన పాటలు ఉర్రూత ఊగించాయి. 'గల్లి సిన్నదీ గరీబోల్ల కధ పెద్దది' అనే పాట తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గోరెటి వెంక‌న్న‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రావ‌టం ప‌ట్ల సీఎం కెసీఆర్ తోపాటు తెలంగాణ కు చెందిన ప‌లువురు మంత్రులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గోరేటి వెంక‌న్న‌కు అభినంద‌న‌లు తెలిపారు.

Next Story
Share it