Telugu Gateway
Telangana

పరువు తీసుకున్న కెసిఆర్ సర్కారు

పరువు తీసుకున్న కెసిఆర్ సర్కారు
X

కోర్ట్ చెపితేనే అధికారికంగా గణతంత్ర వేడుకలు #కోర్ట్ కు వెళ్ళాక గవర్నర్ ప్రసంగానికి ఓకే

ప్రభుత్వం సంప్రదాయాలు పాటిస్తే గవర్నర్ కూడా తన బాధ్యతలను విస్మరించలేరు. ఎప్పుడైనా ఆలా కాదని చేసినా ఆ మేరకు ప్రభుత్వం అయినా..గవర్నర్ అయినా అప్రతిష్ట మూటకట్టుకోవాల్సి వస్తది. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది. సంప్రదాయం ప్రకారం రాష్ట్రంలో అయితే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో...కేంద్రంలో అయితే పార్లమెంట్ లో రాష్ట్రప్రతి ప్రసంగంతో ప్రారంభం అవుతాయి. కానీ తెలంగాణ సర్కారు గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ సంప్రదాయానికి సాంకేతిక అంశాలు సాకుగా చూపుతూ తిలోదకాలు ఇచ్చింది. దీంతో ఈ సారి గవర్నర్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ కు ఆమోదం తెలపలేదు . ఫైనాన్స్ బిల్ గవర్నర్ ఆమోదం లేకుండా సభలో ప్రవేశ పెట్టలేరు. అసెంబ్లీ సమావేశాలు సమయం తక్కువగా ఉండటం, గవర్నర్ ఆమోదం రాకపోవటం తో తెలంగాణ సర్కారు ఏకంగా హై కోర్ట్ ను ఆశ్రయించింది. వాస్తవానికి హై కోర్ట్ కూడా గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయలేదు...ఇది ప్రభుత్వం , గవర్నర్ పరిష్కరించుకోవాల్సిన అంశం. ఫైనాన్స్ బిల్లు ను గవర్నర్ ఏ మాత్రం ఆపలేరు.

నిజంగా అదే జరిగితే దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం హై కోర్ట్ కు పోవటం ఒక తప్పు అయితే ..అక్కడ ఈ సారి గవర్నర్ ప్రసంగం ఉంటుంది అని చెప్పటం, కోర్ట్ కు ఈ మేరకు హామీ ఇవ్వటం ప్రభుత్వ ఘోర వైఫల్యంగా అధికారులు చెపుతున్నారు. అంటే గణతంత్ర దినోత్సవాలు చేయాలనీ తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ చెప్పాలి...బడ్జెట్ ఆమోదం రాలేదు అని కోర్ట్ కి వెళితే అక్కడ సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది అని చెప్పటం అంటే ఇంతకంటే ఫెయిల్యూర్ మరొకటి ఉండదు అని చెపుతున్నారు. ఇదే మాట గవర్నర్ అడిగినప్పుడే చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు అనే అభిప్రాయం ఉంది. ఒకటి కోర్ట్ కెళ్ళి పరువు పోగొట్టుకోవటం, అసలే ఆర్థిక కష్టాల్లో ఉండి దీనికోసం మళ్ళీ భారీఎత్తున ఖర్చుపెట్టి ఢిల్లీ లాయర్లను పిలిపించటం. తెలంగాణ సర్కారు ఇలా పలు అంశాల్లో వరస దెబ్బలు తగులుతున్నాయి. గవర్నర్ తరపు లాయర్ రాజ్యాంగ బద్ద బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తారు అని కోర్ట్ కు తెలిపారు. కోర్ట్ సూచనల మేరకు ఇరువర్గాల లాయర్ లు చర్చలు జరిపారు. అనంతరం కోర్ట్ లో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

Next Story
Share it