గవర్నర్ వ్యవస్థపై స్పందించిన కెసీఆర్

గత కొంత కాలంగా తెలంగాణ సర్కారు వర్సెస్ గవర్నర్ తమిళ్ సై మధ్య వివాదం నడుస్తోంది. గవర్నర్ పర్యటనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రోటోకాల్ అంశాలను కూడా వదిలేసింది. ఈ అంశంపై గవర్నర్ తమిళ్ సై బహిరంగంగానే స్పందించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కూడా ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో సీఎం కెసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా స్పందించారు.
కానీ ఆయన ఎక్కడా తెలంగాణ గవర్నర్ అంశం తప్ప..దేశంలోని గవర్నర్ల పనితీరును తప్పుపడుతూ వ్యాఖ్యానించారు. పన్నెండు మంది ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించి పంపి ఏడాది దాటినా మహారాష్ట్ర గవర్నర్ మాత్రం నిర్ణయం తీసుకోవటంలేదన్నారు.బెంగాల్-తమిళనాడు తో పాటు చాలా రాష్ట్రాల్లో గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ రాజకీయ చరిత్రను మరిచిపోవద్దు. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన గవర్నర్ ...అవమానపడి వెళ్లిపోయారన్నారు.