రేవంత్ చెప్పిన కెసిఆర్ కొత్త కార్ల స్టోరీ
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్త్ర ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెప్పటానికి శ్వేత పత్రం విడుదల చేశామని చెప్పారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ఒక సంచలన విషయం వెల్లడించారు. ఎన్నికలకు ముందే కెసిఆర్ 22 కొత్త ల్యాండ్ క్రూయిజర్లు కొని దాచిపెట్టారు అని..తాను సీఎం అయ్యాక పది రోజుల వరకు తనకే ఈ విషయం తెలియదు అన్నారు. పాత కార్లు ఏదో సర్దుబాటు చేసి..రిపేర్లు చేయించమని తాను చెపితే ఒక అధికారి వచ్చి చెవిలో ఈ విషయం చెప్పారన్నారు. సర్ పోయిన సారే 22ల్యాండ్ క్రూయిజర్లు కొన్నారు. అన్ని విజయవాడలో దాచిపెట్టినం. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం అని వెల్లడించారు.
అయన నెత్తి మీద దరిద్రం ఉండి...ఇంటికి పోయాడు..22 కొత్త ల్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయని చెప్పారు. ఒక్కో బండికి మూడు కోట్ల రూపాయలు అవుద్ది. బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా పెరుగుతుంది. చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టాడు కెసిఆర్. ఆయనకు ..అయన వంది మాగధులకు ఇవ్వటానికి రెడీ చేసి పెట్టారు. ఇట్లాంటివి అయన సృష్టించిన సంపద. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే 66 కోట్లు పెట్టి ఈ కార్లు కొన్నారు. రేవంత్ రెడ్డి బుధవారం నాడు సచివాలయంలో మంత్రులతో కలిసి ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారం తో పాటు లోగో, పోస్టర్ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు.