Telugu Gateway
Telangana

డబ్బు సంపాదించకుండా ఉండలేను!

డబ్బు సంపాదించకుండా ఉండలేను!
X

సోషల్ మీడియా లో తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇరవై లక్షల వాచ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కష్ట పడితే డబ్బులు వస్తాయి...ఇరవై లక్షల తో వాచ్ కొనుక్కోవచ్చు అంటూ ఆమె చేసిన కామెంట్స్...గతం లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్లు జగచేసి వీడియో లను షేర్ చేస్తున్నారు. అటు వాట్సాప్ తో పాటు పేస్ బుక్ లో కూడా ఈ వీడియో లు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబదించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా కిరాయి ఇల్లు. నా సొంత ఇల్లు కాదు.’ ఇవి ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కవిత గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు. తాజాగా ఆమె పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇచ్చారు. గతం లో ఆమె చెప్పిన దానికి బిన్నంగా మాట్లాడారు. తాజా ఇంటర్వ్యూ లో మాత్రం ‘నేను డబ్బులు లేని ఇంటిలో పుట్ట లేదు. డబ్బు సంపాదించకుండా ఉండలేను. చేసే వ్యాపారాల్లో..సక్సెస్ లో వచ్చే డబ్బు ....కాకపోతే నటించే అలవాటు నాకు లేదు. నటించి నేను ఏదో పేద దాన్ని. నేను వాచ్ పెట్టు కొను. నేను కమ్మలు పెట్టుకొను.

ఇలాంటి నటన నాతోని కాదు. నేను ఎప్పుడూ కూడా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు దేవుడి దయవల్ల. ఒక ఇంటర్వ్యూ లో మీకు 20 లక్షల వాచ్ గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నించగా గిఫ్ట్ ఏంది బలే గున్నరు..నేను కొనుకున్నా..ఎప్పుడైనా పెళ్లి రోజో..వాలెంటైన్స్ డే రోజో మా అయన గిఫ్ట్ ఇస్తారు. ఎవరైనా 20 లక్షలు పెట్టి వాచ్ కొంటారా అని ప్రశ్నించగా ఎందుకు కొనుక్కొకూడదు..డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా...డబ్బు సంపాదించాలి...చెమటోడ్చాలి..కష్టపడాలి. వస్తాయి డబ్బులు. చట్టబద్ద మార్గంలో కూడా వస్తాయి. అరవింద్ లాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు టికెట్ లు అమ్ముకున్న బ్యాచ్ వాళ్ళు. వాళ్లకు ఎట్లా కష్ట పడాలో తెలియదు. కష్టపడితే గ్యారంటీగా వస్తాయి. ’ కవిత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Next Story
Share it