Telugu Gateway
Telangana

జర్నలిస్టు బాలకృష్ణకు 'ఆసరా' అవార్డు

జర్నలిస్టు బాలకృష్ణకు ఆసరా అవార్డు
X

వినియోగదారుల హక్కుల అంశానికి విస్తృతంగా ప్రాచుర్యం కల్పిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణను ఆసరా సంస్థ సత్కరించింది. తాజాగా వినియోగ‌దారుల చ‌ట్టాల‌పై అవ‌గాహాన‌కు సంబంధించి హైద‌రాబాద్ లో వినియోగ‌దారుల హాక్కుల దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ విభాగాల్లో స‌మాజ సేవ చేస్తోన్న ప‌లువురుల‌ను స‌త్క‌రించారు.

ఇందులో భాగంగా ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ బాల‌కృష్ణ ను స‌త్క‌రించి, జ్ఝాపికను అందజేశారు ఆ సంస్థ స‌భ్యులు. చ‌ట్టాలు మ‌న‌కు ఎప్ప‌టి నుంచో ఉన్నాయ‌ని అయితే వాటిపై అవ‌గాహాన పెంచుకోవాల‌ని ఆ దిశ‌గా ప్ర‌భుత్వాలు కూడా కృషి చేయాల‌ని వక్తలు కోరారు.

Next Story
Share it