Telugu Gateway
Telangana

ఇది దేనికి సంకేతం!

ఇది దేనికి సంకేతం!
X

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎక్కువ శాతం మేర ఒకే మాట మీద నడిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఇప్పుడు పార్టీ మీద పూర్తిగా కంట్రోల్ పోయిందా?!. పీసిసి అధ్యక్షుడితో ఏ మాత్రం సమన్వయం చేసుకుండా ఏకపక్షంగా ప్రకటన చేయటం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తన పరువు తానే తీసుకున్నారా అన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తెలంగాణ ప్రభుత్వం వేతనాలు...భద్రతతో పాటు అన్ని కలుపుకుని ఈ వెయ్యి రోజుల్లో 22 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసింది అని..కానీ ఆయన ఫార్మ్ హౌస్ కు పరిమితం అయ్యారు తప్ప...రాష్ట్రం..రాష్ట్ర ప్రజల కోసం ఒక్క మాట మాట్లాడలేదు అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కెసిఆర్ రాజీనామా డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులతో పాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా మండల కేంద్రాల్లో ..జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీ లు చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ ఆరు న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం ఉంటుంది అని ...ఈ లోగా మండలాలు..జిల్లాల్లో నిరసనలు చేయాలన్నారు.

విచిత్రం ఏమిటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను కాంగ్రెస్ నాయకులు..క్యాడర్ ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. ఎందుకంటే సీఎం పిలుపు మేరకు కెసిఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు కనిపించటం లేదు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఒక్క గజ్వేల్, సిద్ధిపేట ప్రాంతాల్లో అరకొరగా కార్యక్రమాలు జరిగాయి కానీ...రాష్ట్రంలో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పిలుపుపై స్పందించలేదు. నిజంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమం తలపెడితే పీసీసీ ప్రెసిడెంట్ తో ఒక మీటింగ్ పెట్టుకుని ఇలాంటివి ప్లాన్ చేయాలి కానీ..ఏకపక్షంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెపితే ఎవరు పట్టించుకుంటారు అని ఒక సీనియర్ నేత ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ చేసిన డ్యామేజ్ తో ఇప్పటికే మంత్రుల్లోనే చాలా మంది సీఎం రేవంత్ రెడ్డి ని సీరియస్ గా తీసుకోవటం మానేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.

అధిష్ఠానం ఇప్పుడు మంత్రి కొండా సురేఖ తో పాటు చిన్నారెడ్డి పై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి కొంత మారుతుంది కానీ...ఏ మాత్రం తేడా వచ్చినా మిగిలిన రెండేళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడ్డుకాలం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెపుతున్నారు. పైకి సీఎం రేవంత్ర్ రెడ్డి పదే పదే తనది ...పీసీసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ది హిట్ కాంబినేషన్ గా నిలవబోతుంది అని చెపుతున్నా కూడా...ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది అని పార్టీ వర్గాలు చెపుతున్నారు. దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలే అని అటు మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కూడా ఇంకా అటు ప్రభుత్వంలోనూ..ఇటు పార్టీలో గందరగోళ పరిస్థితులు కొనసాగటం రాజకీయంగా ఏ మాత్రం సరికాదు అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it