Telugu Gateway
Telangana

ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌

ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌
X

ఆరేళ్ల ప‌ద‌వీ కాలం ఇంకా మిగిలి ఉండ‌గానే తెలంగాణ‌కు చెందిన‌ ఐపీఎస్ అధికారి ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌భుత్వానికి స్వ‌చ్చంద ప‌ద‌వి విర‌మ‌ణ‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. రాజీనామా ఆమోదం అనంతరం త‌న‌కు ఇష్ట‌మైన ప‌ని చేస్తూ ముందుకు సాగుతాన‌న్నారు. 1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాసిన రెండు పేజీల లేఖను ప్రవీణ్‌ కుమార్‌ బహిర్గతం చేశారు.

26 ఏళ్ల పాటు పోలీస్‌ విభాగంలో పని చేశానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ సందర్భంగా తన పదవీకాలానికి సంబంధించిన కొన్ని విషయాలను లేఖలో ప్రస్తావించారు. అయితే ఆయ‌న రాజీనామా లేఖ బ‌య‌ట‌కు వ‌చ్చిన కొద్దిసేప‌టికే ఆయ‌న అధికార టీఆర్ఎస్ త‌ర‌పున హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం హోరెత్తింది. అయితే ఇందులో వాస్త‌వం ఎంత అన్న‌ది తేలాల్సి ఉంది. గురుకులాల్లో ప్ర‌వీణ్ కుమార్ త‌న‌దైన ముద్ర‌వేశారు. అదే స‌మ‌యంలో కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు.

Next Story
Share it