ఇండస్ కార్ప్ కేర్ వార్షిక సమావేశం
BY Vasi Reddy12 Jun 2026 2:05 PM IST

X
Vasi Reddy12 Jun 2026 2:09 PM IST
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆగ్రో కెమికల్ కంపెనీ ఇండస్ కార్ప్ కేర్ వార్షిక సమావేశం శుక్రవారం నాడు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ప్రధానంగా 2026 -2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సంస్థ ఎండీ కందుల నరేంద్రనాథ్ దత్ వెల్లడించారు. రైతుల అభివృద్ధే లక్ష్యంగా అధిక నాణ్యత, అందుబాటు ధరల వ్యవసాయ ఉత్పత్తులతో రైతులకు తోడ్పాటునందిస్తున్నాము అని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతూ, సుస్థిర వ్యవసాయానికి మద్దతు అందించడం ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వార్షిక సమావేశంలో సంస్థ ఈడీ అనూప్ కుమార్, డైరెక్టర్ బి. రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది.
Next Story



